తమన్నా క్వీన్ మళ్లీ మొదలైంది

0బాలీవుడ్ మూవీ క్వీన్ ను తెలుగుతో కలిపి నాలుగు దక్షిణాది భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. క్వీన్ వన్స్ ఎగైన్ అంటూ తెలుగు వెర్షన్ రూపొందుతుండగా..ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా టైటిల్ రోల్ పోషిస్తోంది.

గతేడాది మధ్యలోనే షూటింగ్ ఆరంభించుకున్న ఈ చిత్రానికి.. గత డిసెంబర్ లోనే బ్రేక్ పడిపోయింది. ఇందుకు కారణం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలుగు వెర్షన్ కు దర్శకత్వం వహిస్తున్న ట్యాలెంటెడ్ డైరెక్టర్ నీలకంఠ.. ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. నీలకంఠ ఎగ్జిట్ కు కారణం తెలియకపోయినా.. ఇతడి కారణంగా సినిమా షూటింగ్ ఆరు నెలలుగా ఆగిపోయింది. ఎట్టకేలకు అ! చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఈ మూవీని షూటింగ్ చేసిన పార్ట్ ను మినహాయించి.. మిగిలిన భాగాన్ని చిత్రీరించేందుకు అంగీకరించడంతో.. ఇప్పుడు మళ్లీ తెలుగు క్వీన్ పట్టాలెక్కింది.

దాదాపు ఆరు నెలల తర్వాత తమన్నా మళ్లీ రాణిగా నటించడం మొదలుపెట్టింది. కర్నాటకలోని మైసూర్ లో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఒకటి రెండు సన్నివేశాలు మినహా.. గతంలో తీసిన సీన్స్ తప్ప.. మిగిలిన షూటింగ్ నే కొనసాగించనున్నారట. హిందీ వెర్షన్ లో లీసా హేడెన్ నటించిన పాత్రలో.. బాలీవుడ్ భామ ఎల్లి ఆరామ్ తో చేయిస్తున్నారు.