నేనేమైనా భర్తలను షాపింగ్ చేస్తున్నానా?

0మిల్కీ బ్యూటీ తమన్నామీద ఇప్పటివరకూ వచ్చిన పెళ్లి రూమర్లు ఏంటో మీకు తెలుసా? అప్పుడెప్పుడో ఒక హీరో తో స్ట్రాంగ్ లవ్ లో ఉంది త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతుంది అన్నారు.. ఆ తర్వాత ఓ క్రికెటర్ తో ప్రేమాయణం సాగిస్తుంది అంది తొందరలో పెళ్లిదాకా వెళుతుంది అన్నారు. తాజాగా తమన్నా ఒక డాక్టర్ ని వివాహం చేసుకోవడానికి రెడీ అవుతోందని అయన అమెరికా బేస్డ్ డాక్టర్ అని వార్తలు వచ్చాయి. గతంలో తన పెళ్ళి వార్తలపై పెద్దగా రియాక్ట్ కాలేదుగానీ ఇప్పుడు మాత్రం గట్టిగా రెస్పాన్స్ ఇచ్చింది.

తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక పెద్ద లెటర్ పోస్ట్ చేసింది. “ఒక రోజు యాక్టర్.. మరో రోజు క్రికెటర్.. ఇప్పుడేమో డాక్టర్. ఈ రూమర్లను చూస్తుంటే నేను భర్తలను షాపింగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. లవ్ ఉండడం అనే అనుభూతి మంచిదే కానీ నా పర్సనల్ లైఫ్ గురించి ఆధారం లేని రూమర్లు రావడం నాకు నచ్చదు. నేనొక హ్యాపీ సింగిల్.. అమ్మనాన్నలు ఇప్పుడూ అబ్భాయినేమీ వెతకడం లేదు. ఇప్పుడు నా దృష్టి అంతా సినిమానే.. నాకిప్పుడంతా నా ప్రొఫెషనే. నేనేదో నాపాటికి షూటింగ్ చేసుకుంటుంటే ఈ రూమర్లు ఎక్కడినుంచో వస్తున్నాయి. అసలు పెళ్లి లాంటిది ఏమైనా ఉంటే నేనే చెప్తాను. అప్పటి వరకూ నేనో విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. నా పెళ్లి ఇప్పట్లో లేదు.. ఆ ప్రయత్నాలు జరగడం లేదు. ఇవన్నీ ఎవరివో ఊహాగానాలు తప్ప నిజం కాదు.”

భర్తల షాపింగ్ – మ్యారేజ్ లాంటి విషయాలు పక్కనబెడితే తమన్నా ప్రస్తుతం కునాల్ కోహ్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా తో పాటుగా చిరంజీవి ‘సైరా’ లో కూడా నటిస్తోంది. హిందీ లో ‘ఖామోషి’ తమిళ్ లో ‘కన్నె కలైమాని’ అనే సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాక మరో రెండు ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి.