గుమ్మడికాయ కొట్టిన దట్ ఈజ్ మహాలక్ష్మి!

0మిల్కీ బ్యూటీ తమన్నా ఈమధ్య టాప్ స్టార్స్ సినిమాల్లో ఈమధ్య పెద్దగా కనిపించడం లేదు. కొత్త హీరోయిన్ల దెబ్బకు కాస్త స్పీడు తగ్గిందని అనుకున్నారు గానీ అర డజనుకు పైగా సినిమాల్లో నటిస్తూ అందరినీ సర్ప్రైజ్ చేస్తోంది. కునాల్ కోహ్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా తో పాటుగా చిరంజీవి ‘సైరా’ లో కూడా నటిస్తోంది. హిందీ లో ‘ఖామోషి’ తమిళ్ లో ‘కన్నె కలైమాని’ అనే సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాక మరో రెండు ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి.

ఇవన్నీ పక్కన బెడితే ఈమధ్యే బాలీవుడ్ సూపర్ హిట్ ఫిలిం ‘క్వీన్’ కు రీమేక్ అయిన ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ సినిమాలో కూడా నటిస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా చివరి షెడ్యూల్ ఈమధ్యే యూరోప్ లో కంప్లీట్ అయిందట. దీంతో ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ షూటింగ్ మొత్తం పూర్తయిందని సమాచారం. ఈ సినిమాలో తమన్నా కు జంటగా సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్నాడు. అమిత్ త్రివేది ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు ‘అ’ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్టర్. మను కుమరన్ ఈ సినిమా మీడియంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

సేమ్ బ్యానర్ పై తమిళ – కన్నడ వెర్షన్లు కూడా ఒకేసారి తెరకెక్కుతున్నాయి. తమిళ వెర్షన్ టైటిల్ ‘పారిస్ పారిస్’ కాగా కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ లో నటిస్తోంది. మరోవైపు కన్నడ వెర్షన్ ‘బట్టర్ ఫ్లై’ లో పరుళ్ యాదవ్ హీరోయిన్. ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ఫిలిం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.