ఎల్ఈడీలతో పోటీగా తమన్నా

0tamanna-picమిల్కీ బ్యూటీ తమన్నా మేని సొగసుల్లోని తెల్లదనానికి పోటీ ఇవ్వడం ఎవరికైనా కష్టమైన విషయం. చాలాసార్లు అమ్మడి దేహానికి కాసింత బ్లాక్ మేకప్ వేసి మరీ షూటింగ్ చేసే వాళ్లమని మేకప్ మెన్ చెబుతూ ఉంటారు. మరి ఇలాంటి తెల్లటి అందం.. తనకు పోటీ ఇచ్చే ఓ యాడ్ లో చేస్తోంది.

తాజాగా ఓ ఎల్ ఈడీ బల్బుల కంపెనీతో బ్రాండ్ అండార్స్ మెంట్ కుదుర్చుకుంది మిల్కీ బ్యూటీ. ఇప్పటికే అగ్రిమెంట్స్ పూర్తయిపోగా త్వరలో యాడ్స్ కూడా టెలికాస్ట్ కానున్నాయి. అమ్మడి తెల్లదనానికి ఎల్ఈడీ బల్బుల మెరుపులకు మధ్య పోటీ అన్నమాట. తన మేని మెరుపులను సవాల్ ఓ ప్రొడక్ట్ కు తమన్నా యాడ్ క్యాంపెయిన్ చేయడం ఆసక్తి కలిగిస్తోంది. సాధారణంగా ఇలాంటి లైటింగ్ యాడ్స్ చీకటిని థీమ్ గా చేసుకుని ప్రకటనలు రూపొందిస్తాయి.

కానీ తమన్నా తమ యాడ్ కేంపెయినర్ కావడంతో.. ఫుల్ వైట్ థీమ్ తో అటు లైట్లను.. ఇటు మిల్కీని పెట్టి ప్రకటనలు రూపొందించారట. మరి మిలమిల్లాడే ఎల్ ఈడీ బల్బులతో మిల్కీ బ్యూటీ తెల్లదనం పోటీ ఎలా ఉంటుందో చూడాలి!