తమన్నా కు మరో క్రేజీ సినిమా ఛాన్స్

0కెరీర్లో స్లో అయిందని మిల్కీ బ్యూటీ తమన్నా పని ఇక అయిపోయిందని ఈమధ్య టాక్ వినిపిస్తోంది గానీ నిజంగా మాత్రం అది నిజం కాదు. ఎందుకంటే ‘క్వీన్’ తెలుగు రీమేక్ తో పాటు.. ‘F 2’ .. ‘సైరా’.. కునాల్ కోహ్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరొక సినిమాలోనూ నటిస్తోంది. ఇవి కాకుండా తమిళంలో ‘కన్నె కలైమాని’ అనే సినిమాలో కూడా నటిస్తోంది.

ఇవన్నీ కాకుండా తాజాగా సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కనున్న మరో తాజా ప్రాజెక్టులో కూడా హీరోయిన్ గా ఎంపిక అయినట్టు వెల్లడించింది. ట్రైడెంట్ ఆర్ట్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తారట. ఈ సినిమాలో హీరో విశాల్. విశాల్ తో నటించడం తమన్నాకు ఇది రెండో సారి. గతంలో తమన్నా ‘కత్తి సండై’ సినిమాలో విశాల్ తో నటించింది. ఇక ఈ యాక్షన్ సినిమాను జనవరి 2019 లో సెట్స్ మీదకు తీసుకెళ్తారట.

సుందర్ సార్ సినిమాకు పని చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా – ఎగ్జైటింగ్ ఉందని చెప్పింది. అంతేకాదు ఈ సంవత్సరమంతా డిఫరెంట్ సినిమాలలో నటించే అవకాశం వచ్చిందని… హెక్టిక్ గా ఉన్నప్పటికీ ఒక జానర్ కు పరిమితం కాకుండా ఇలా డిఫరెంట్ పాత్రలు లభించడం తనకు సంతోషాన్నిచ్చిందని తెలిపింది.