తమన్నాకు పెళ్లిచూపులు!

0



tamanna-to-surprise-allతమన్నా వంటి స్టార్ హీరోయిన్ కనపడగానే మీడియావాళ్ళు ఊరుకుంటారా..వెంటనే ‘పెళ్లెప్పుడు?’ అని అడుగుతుంటారు. ఈ ప్రశ్న తమన్నా చాలాసార్లు ఎదుర్కొన్నారు. ‘జరిగినప్పుడు చెబుతానండి’ అని సమాధానం ఇస్తూ దాటుకొచ్చిందీ బ్యూటీ. అయితే ఇప్పుడు పెళ్లిచూపులకు రెడీ అయ్యారు. కంగారుపడకండి… తమన్నా పెళ్లి చూపులేంటి..పెళ్లి చేసుకోవటానికి ఫిక్సైందా అని కంగారుపడి బెస్ట్ విషెష్ చెప్పేయకండి.

ఆమె పెళ్లిచూపులుకు కూర్చుంటోంది కానీ నిజ జీవితంలో కాదు..పెళ్లి చూపులు తమిళ రీమేక్ లో . అవును..తమన్నా..తమిళ పెళ్లి చూపులు రీమేక్ లో హీరోయిన్ గా చేయటానికి ఎంపికైందని తమిళ సినీ వర్గాల సమాచారం. విజయ్‌ దేవరకొండ, రితూ వర్మ నటించిన ‘పెళ్లి చూపులు’ తమిళ రీమేక్‌లో తమన్నా హీరోయిన్‌గా నటించనున్నారు.

ఈ చిత్రం తమిళ హక్కులను దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ దక్కించుకున్నారు. నూతన హీరోతో ఈ రీమేక్‌ని తన సహాయ దర్శకుడు సెంథిల్‌ వీరాస్వామి దర్శకత్వంలో నిర్మించనున్నారు. తమన్నా స్టార్‌డమ్‌ ఈ చిత్రానికి వర్కవుట్‌ అవుతుందని గౌతమ్‌ మీనన్‌ పేర్కొన్నారు.