మిల్కీకి మెగా డ్యాన్సింగ్ ఛాన్స్

0

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `ఉయ్యాలవాడ నరసింహారెడ్డి` శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కోకాపేట అగ్ని ప్రమాదం తర్వాతా పెండింగ్ పనుల్లో జాప్యం జరగకుండా సైరా టీమ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాల్ని రామోజీ ఫిలింసిటీలో తెరకెక్కిస్తున్నారు. తదుపరి పెండింగ్ షెడ్యూల్స్ ఏం ఉన్నాయి? అన్నది పరిశీలిస్తే…

వికారాబాద్ అడవుల్లో కొద్ది రోజుల పాటు ఓ కీలక షెడ్యూల్ ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత అన్నపూర్ణ ఏడెకరాల్లో వేసిన మూడు సెట్స్ లో ఓ భారీతనం నిండిన పాటను తెరకెక్కిస్తారట. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా అద్భుతమైన డ్యాన్స్ చేయబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సెట్ కి సంబంధించిన లీక్డ్ ఫోటోలు వెబ్ లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

సౌత్ నాయికల్లో మిల్కీ డ్యాన్సింగ్ స్కిల్స్ కి ప్రత్యేకించి గుర్తింపు ఉంది. అందుకే మెగాస్టార్ చిరంజీవి అంతటి అల్టిమేట్ డ్యాన్సింగ్ హీరో సరసన స్టెప్పులేయబోతోంది? అంటే అందుకు తగ్గట్టే అంచనాలు పెరిగిపోతాయి. మరి మెగాస్టార్ రేంజుకు తగ్గట్టు స్టెప్పులేసి మైమరిపిస్తుందా.. లేక తడబడుతుందా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. ఒకవేళ తడబడితే అమ్మడికి మెగా ఫ్యాన్స్ నుంచి కోటింగ్ ఉంటుందనడంలో సందేహమేం లేదు. అమితాబ్.. నయనతార.. విజయ్ సేతుపతి.. జగపతిబాబు.. సుదీప్ వంటి స్టార్లు నటిస్తున్నారు. వీళ్లందరి మధ్య తమన్నా ఎలాంటి ప్రాధాన్యత ఉన్న రోల్ చేస్తోంది? అన్నది సైరా టీమ్ చెప్పాల్సి ఉంటుంది. దసరా బరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నా భారీ విజువల్ గ్రాఫిక్స్ వల్ల అనుకున్న సమయానికి వస్తుందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.
Please Read Disclaimer