అన్నయ్య పెళ్లిలో తమన్నా సందడి

0Tamanna--Shines-In-Brother-s-Weddingమిల్క్ బ్యూటీ తమన్నా చీరకట్టులో మెరిసిపోయింది. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా, అందమే అసూయపడేలా తమన్నా అంకరణ అదిరిపోయింది. ఇదంతా ఎందుకోసం అనుకుంటున్నారా.. తమన్నా అన్నయ్య ఆనంద్ భాటియా పెళ్లిపీటలెక్కారు. యూఎస్‌లో డాక్టర్‌గా స్థిరపడిన ఆనంద్.. కృతిక చౌదరిని వివాహమాడారు. ముంబైలో జరిగిన ఈ పెళ్లు వేడుకలో తమన్నా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముంబైలోని ఓ స్టార్ హోటల్‌లో నిర్వహించిన సంప్రదాయ సంగీత్, మెహందీ వేడుకల్లో తమన్నా చురుక్కా పాల్గొనడమే కాకుండా, డ్యాన్సులతో ఇరగదీసింది.

అన్న, వదినలతో చిందులేసింది. ఇప్పుడాఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులతో కలసి ఎంతో ఆహ్లాదంగా గడిపిన తమన్నా ఫొటోలను ఫేస్‌బుక్, ట్విట్టర్లలో తెగ షేర్ చేస్తున్నారు.