జల్లికట్టుకు గ్రీన్ సిగ్నల్

0Jallikattu-Ordinanceజల్లికట్టు క్రీడకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎద్దుల్ని హింసించే జల్లికట్టుపై 2014లో సుప్రీంకోర్టు నిషేధం విధించిన విషయం విదితమే. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని తమిళ ప్రజలు గత కొన్ని రోజుల నుంచి ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. తమిళ ప్రజల ఆందోళనలు, నిరసనలకు ఫలితం లభించింది. జల్లికట్టు ఆర్డినెన్స్ ఎట్టకేలకు శనివారం ఆమోదం పొందింది. తమిళనాడు ఇన్‌ఛార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు జల్లికట్టు ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారు.

దీంతో మధురై జిల్లా అలంగానల్లూరులో ఆదివారం జల్లికట్టు క్రీడ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఆదివారం ఉదయం 10 గంటలకు జెండా ఊపి జల్లికట్టు ఆటను ప్రారంభించనున్నారు. ఆయా జిల్లాల్లో ఉదయం 11 గంటలకు జల్లికట్టును మంత్రులు ప్రారంభిస్తారు. ఇక ఈ నెల 23న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

జల్లికట్టు ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలపడంతో తమిళ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జల్లికట్టుకు అనుమతివ్వాలని కోరుతూ సంక్రాంతి పర్వదినం నుంచి తమిళ ప్రజలు, ప్రముఖులు, కోలీవుడ్ వర్గాలు ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం విదితమే. జల్లికట్టు కోసం మేరీనా బీచ్ జనసంద్రమైన విషయం తెలిసిందే.