విశాల్ కు ఆ అధికారాలు తొలగించిన ప్రభుత్వం

0

తమిళ హీరో విశాల్ ఒక వైపు నడిగర్ సంఘంను మరియు నిర్మాతల మండలిని నడిపిస్తున్న విషయం తెల్సిందే. ఎంతో మంది సీనియర్ నిర్మాతలు ఉన్నా కూడా విశాల్ పట్టుదలతో నిర్మాతల మండలి అధ్యక్షుడిగా అయ్యాడు. అయితే విశాల్ నిర్మాతల మండలి అధ్యక్షుడు అయినప్పటి నుండి కూడా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించకుండానే సొంత నిర్ణయాలు తీసుకుని కోట్లాది రూపాయల నిధులను దుర్వినియోగం చేస్తున్నట్లుగా చిన్న నిర్మాతలు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. విశాల్ తన సొంత ఇమేజ్ ను పెంచుకునేందుకు నిర్మాతల మండలి నిధులను దుర్వినియోగం చేయడంతో పాటు పెద్ద నిర్మాతలకే అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అంటూ చాలా రోజులుగా విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ వివాదం తమిళనాడు ప్రభుత్వం వద్దకు వెళ్లింది. విశాల్ తన అధికారంను దుర్వినియోగం చేస్తున్నాడనే ఆరోపణపై ప్రభుత్వం స్పందించింది. విశాల్ తన అధికారంను దుర్వినియోగం చేయకుండా అతడు ఇకపై నిధులు ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టకుండా ఒక అధికారిని నియమించింది. ఆ అధికారి ఆధ్వర్యంలోనే నిర్మాతల మండలికి సంబంధించిన కార్యక్రమాలు అన్ని జరగాల్సి ఉంటుంది. కీలక నిర్ణయాలు ఏమీ తీసుకున్నా కూడా ఆయన అనుమతి తప్పనిసరిగా ఉండాలి.

ఇక ఆర్థిక పరమైన విషయాలను కూడా ఆయన అనుమతితోనే చేపట్టాల్సి ఉంటుంది. అధ్యక్షుడిగా విశాల్ ఇక డమ్మీగా మాత్రమే ఉంటాడు. పేరుకు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ ఉన్నా ఏ నిర్ణయంను అతడు సొంతంగా తీసుకోలేడు. ప్రతి విషయంను కూడా ప్రభుత్వం నియమించిన అధికారికి తెలియజేసి అతడి అనుమతి తీసుకుని అమలు చేయాల్సి ఉంటుంది. ఇలా నిర్మాతల మండలిని ఒక అధికారితో నియంత్రిచడం ఏమాత్రం పద్దతి కాదని కొందరు నిర్మాతలు అంటుంటే మరి కొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు. మరి విశాల్ ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
Please Read Disclaimer