తమ్ముడు పెద్ద తప్పు చేశావ్ : కౌశల్ ఆర్మీ

0తెలుగు బిగ్ బాస్ ముగింపు చేరుకున్న నేపథ్యంలో నిర్వాహకులు ఫ్యామిలీ రీ యూనియన్ పెట్టారు. పార్టిసిపెంట్స్ కు సంబంధించిన ఒకరు – ఇద్దరు ఇంట్లోకి వెళ్లి ప్రేక్షకులను థ్రిల్ చేయడం జరిగింది. సామ్రాట్ తల్లితో ప్రారంభం అయిన ఈ రీ యూనియన్ రెండు ఎపిసోడ్ లు పూర్తి అయినా ఇంకా కొనసాగుతూనే ఉంది. తనీష్ ను కలిసేందుకు అతడి తమ్ముడు రావడం జరిగింది. తమ్ముడు రావడంతో తనీష్ చాలా ఎమోషనల్ అయ్యాడు. వచ్చిన వారు అంతా కూడా వారి వారికి సలహాలు ఇస్తూ ఉండగా తనీష్ తమ్ముడు మాత్రం కౌశల్ కు సలహా ఇవ్వడం విమర్శించినట్లుగా మాట్లాడటం ఇప్పుడు దుమారం రేపుతోంది.

దీప్తిని కెప్టెన్సీ నుండి బిగ్ బాస్ తొలగించిన సమయంలో కౌశల్ వ్యవహరించిన తీరుపై అతడు ప్రశ్నించాడు. ఒక వైపు దీప్తి కెప్టెన్సీ పోయిందని బాధను వ్యక్తం చేస్తూనే మరో వైపు కెమెరా ముందుకు వెళ్లి తనకు ఆ కెప్టెన్సీ ఇవ్వమని అడగడం ఏంటీ అంటూ కౌశల్ను తనీష్ తమ్ముడు ప్రశ్నించాడు. తనీష్ పై గతంలో పలు సార్లు కౌశల్ విమర్శలు చేయడం జరిగింది. ఆ కారణంగానే ఇప్పుడు అతడి తమ్ముడు కౌశల్ ను టార్గెట్ చేసి ఉంటాడు అంటూ కౌశల్ ఆర్మీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తనీష్ తమ్ముడి వ్యవహార తీరుపై తీవ్ర స్థాయిలో కౌశల్ ఆర్మీ ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే అతడిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ పడుతున్నాయి. నువ్వు నీ అన్నకు తక్కువేం కాదుగా ఇతరులను విమర్శించడంలో ముందు ఉంటావు కదా అంటూ కౌశల్ ఆర్మీ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు కౌశల్ పై కామెంట్స్ చేసి పెద్ద తప్పు చేశావ్ ఆ ఎఫెక్ట్ నీ అన్నపై ఖచ్చితంగా పడుతుంది అంటూ కౌశల్ ఆర్మీ సభ్యులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్ లు చేస్తున్నారు. కౌశల్ ఆర్మీని అనవసరంగా కెలికాడు అంటూ తనీష్ తమ్ముడి గురించి సాదారణ ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు. తమ్ముడి వ్యాఖ్యలకు తనీష్ ఎంత మూల్యం చెల్లించుకుంటాడో చూడాలి.