రాఖీపై రివర్స్ ఎటాక్..తనూశ్రీ సంచలన వ్యాఖ్యలు

0

బాలీవుడ్ ను కుదిపేస్తున్న మీటూ ఉద్యమంకు ఆజ్యం పోసినది తనూశ్రీ దత్తా అనే విషయం తెల్సిందే. నానా పటేకర్ పై ఆమె లైంగిక వేదింపుల ఆరోపణలు చేయడంతో పాటు – విదేశాల్లో ఉన్న మీటూ ఉద్యమం ను ఇండియాలో మొదలు పెట్టింది. తనూశ్రీ దత్తా ఎప్పుడైతే మీటూ అంటూ లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిందో అప్పటి నుండి పెద్ద ఎత్తున మీటూ ఉద్యమం ఇండియాలో షురూ అయ్యింది. తనూశ్రీ దత్తాకు బాలీవుడ్ లోని పలువురు హీరోయిన్స్ మద్దతుగా నిలుస్తున్నారు. మరో వైపు తనూశ్రీ దత్తాపై విమర్శలు చేస్తున్నారు. తనూశ్రీ దత్తాపై విమర్శలు చేస్తున్న వారిలో ప్రథమంగా రాఖీ సావంత్ ఉంటుంది.

తనూశ్రీ డ్రగ్స్ తీసుకుని – పలు సార్లు రేప్ చేసిందని రాఖీ సావంత్ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పటికే తనూశ్రీ దత్తా పరువు నష్టం దావా వేయడం జరిగింది. కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్న తనూశ్రీ దత్తా తాజాగా మీడియా ముందుకు వచ్చి రాఖీ సావంత్ పై రివర్స్ ఎటాక్ మొదలు పెట్టింది. తనూశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. రాఖీ సావంత్ గురించి ఈ వారం పది రోజుల్లో చాలా విషయాలు తెలుసుకున్నాను – ఆమె పరిస్థితి గురించి తెలిసి జాలి కలుగుతుందని తనూశ్రీ దత్తా అంది.

రాఖీ సావంత్ ఆస్తులు మొత్తం కూడా తాకట్టులో ఉన్నాయి – ఆమెకు అమెరికా వెళ్లేందుకు వీసా రావడం లేదు – వీసా రిజెక్ట్ లో ఉంది. కొన్ని మోసపూరిత సంఘటనల కారణంగా ఆమె మొత్తం ఆస్తులను పోగొట్టుకుంది. ప్రస్తుతం ఆమె చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. స్నేహితుల సాయంతో గడిపేస్తున్నట్లుగా నాకు తెలిసింది. నాపై ఆరోపణలు చేయడం – నన్ను బ్లేమ్ చేయడం వల్ల ఆమెకు ఆర్థికంగా ఎవరైనా సాయం చేస్తారేమో అంది. ఇప్పటి వరకు రాఖీ సావంత్ ట్రాన్స్ జెండర్ ఉమెన్ అనే పుకారు ఉంది. కాని తాజాగా నాకు తెలిసిన విషయం ప్రకారం రాఖీ సావంత్ నిజంగానే ట్రాన్స్ జెండర్ ఉమన్ అని – ఆమె గురించి అందరికి తెలుసని – ఆమె నా గురించి వ్యాఖ్యలు చేసినంత మాత్రాన నేను ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోను అంటూ తనూశ్రీ చెప్పుకొచ్చింది. మొత్తానికి మీటూ ఉద్యమం కాస్త వీరిద్దరి పర్సనల్ గొడవగా మారిపోయింది.
Please Read Disclaimer