పటేల్ సార్ చిత్రంలో తాన్య

0tanya-hopeఅప్పట్లో ఒకడుండేవాడు చిత్రంలో తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న భామ తాన్య. నారా రోహిత్.. శ్రీవిష్ణు ఇద్దరూ తమ నటనతో మెప్పించినా వారితో పాటు తనకు కూడా గుర్తింపు దక్కేటంతటి నటనను చూపింది. ఆ మూవీ కారణంగా ఇప్పటికే ఓ తెలుగు సినిమాకు సైన్ చేయగా.. జూలై నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇప్పుడు జగపతి బాబు లీడ్ రోల్ లో నటిస్తున్న పటేల్ సార్ మూవీలో కూడా తాన్యా ఓ కీలక పాత్రలో నటించనుంది. ఇప్పటికే ఈ రోల్ కోసం సైన్ చేసినట్లు చెబుతోంది తాన్య. ‘ఈ మూవీలో భాగం కావడం నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నా యాక్టింగ్ ట్యాలెంట్ ను చూపేందుకు దక్కిన అవకాశంగా భావిస్తున్నాను. ఈ పాత్రలో విభిన్నమైన షేడ్స్ ఉంటాయి. ప్రస్తుతం రోజుకు మూడు గంటల పాటు వర్క్ షాప్ లో పాల్గొంటున్నాను. రోల్ క తగినట్లుగా బాడీ లాంగ్వేజ్.. డైలాగ్స్.. ఎక్స్ ప్రెషన్స్ ను ప్రాక్టీస్ చేస్తున్నాను. నా పాత్రతో ఓ సస్పెన్స్ ఎలిమెంట్ కూడా మిక్స్ అయి ఉంటుంది’ అని చెప్పింది తాన్యా.

వాసు పరిమి దర్శకత్వంలో తెరకెక్కనున్న పటేల్ సార్ షూటింగ్.. మే నెలలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ చిత్రంలో లీడ్ హీరోయిన్ పాత్ర కోసం మలయాళ నటి భావనను సంప్రదించారు మేకర్స్. అయితే.. ఇంకా భావన నుంచి కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.