చిన్న సినిమా కోసం ..లేకుండానే చేసిన తాప్సీ..?

0Tapsee-Remuneration-for-anandobrahmaటాలీవుడ్‌పై వరుస విమర్శలను గుప్పిస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలవడానికి ప్రయత్నిస్తుంది తాప్సి పన్ను. ఆమె నటించిన ‘ఆనందో బ్రహ్మ’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్నే సాధించింది. అయితే ఈ చిత్రంలో నటించడానికి ఈ ఢిల్లీ భామ పారితోషికం తీసుకోలేదట. ఉచితంగా నటించిందట. కేవలం కథను నమ్ముకునే ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకుందట. కాకపోతే ఈ సినిమా విజయం సాధించిన తర్వాత నిర్మాతకు లాభం వస్తే దానిలో కొంత వాటా ఇస్తే చాలని తాప్సీ చెప్పినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఏదేమైనా డబ్బు కోసం కాకుండా కథపై నమ్మకంతో తాప్సీ ఈ సినిమా చేసినందుకు సినీ పరిశ్రమ పెద్దలు కూడా మెచ్చకుంటున్నారట.