హిందీ అర్జున్ రెడ్డికి హీరోయిన్ కష్టం

0గత ఏడాది విడుదలై సంచలన విజయం సాధించడమే కాక విజయ్ దేవరకొండ రేంజ్ ని అమాంతం పెంచేసిన అర్జున్ రెడ్డి తమిళ్ హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ లో విక్రమ్ కొడుకు ధృవ్ ని దీని ద్వారా పరిచయం చేస్తుండగా హిందీలో సందీప్ రెడ్డి వంగానే బాధ్యతలు తీసుకుని షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం షాహిద్ కపూర్ దీని కోసమే ప్రత్యేకంగా గెడ్డం పెంచే పనిలో ఉన్నాడు. ఇందులో హీరోతో పాటు సమాన ప్రాధాన్యం ఉండే పాత్ర హీరోయిన్ ప్రీతీది. మొదట తారా సుతారియాను తీసుకున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2 ద్వారా బాలీవుడ్ కు పరిచయమవుతోంది. దాని షూటింగ్ అనుకున్న రీతిలో సాగడం లేదు. దీంతో ఈ ఏడాది అనుకున్న విడుదల ఏకంగా వచ్చే సమ్మర్ కి షిఫ్ట్ అయిపోయింది. దీంతో పాపకు కాల్ షీట్స్ సమస్య వచ్చేసింది. తప్పని పరిస్థితుల్లో అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ఆఫర్ ను వదిలేసుకుంది.

దీంతో కథ మళ్ళి మొదటికే వచ్చింది. మరో హీరోయిన్ వేటలో పడింది టీమ్. షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభించాల్సి ఉంది. షాహిద్ కపూర్ కొత్త సినిమా బత్తి గుల్ మీటర్ చాలు 21న విడుదల అవుతోంది. అది అవ్వగానే పూర్తిగా ఫ్రీ అయిపోతాడు. కొన్ని నెలల పాటు అర్జున్ రెడ్డి రీమేక్ తప్ప ఇంకే షూటింగ్ లోనూ ఉండడు. సో ఆ లోపే కొత్త హీరోయిన్ ని సెట్ చేసుకోవాలి. సీనియర్లైతే ఆ ఫీల్ రాదు కాబట్టి ఫ్రెష్ బ్యూటీ కోసం అన్వేషణ సాగుతోంది. వీలైతే సౌత్ భామ కుదిరినా తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. వచ్చే ఏడాది విడుదలయ్యే అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కు టైటిల్ డిసైడ్ చేయలేదు. తమిళ్ కు మాత్రం వర్మ అని ఫిక్స్ అయ్యింది. సందీప్ రెడ్డి వంగా తన ఫోకస్ మొత్తం హిందీ రీమేక్ పైనే పెట్టాడు.