యాడ్ కోసం.. నయనతార భారీ పారితోషకం

0


Nayanthara-tata-sky-adఒకవైపు వయసు మీద పడుతున్నా.. నటీమణి నయనతార డిమాండ్ మాత్రం ఏమీ తగ్గడం లేదు. దక్షిణాదిన స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నయనకు అవకాశాలు వరిస్తూనే ఉన్నాయి. మరోవైపు ఆమె సోలోగా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీలు వస్తున్నాయి. దీంతో నయనతార భారీ పారితోషకాన్ని పొందుతోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు నయన మూడు కోట్ల రూపాయల వరకూ తీసుకుంటోందని టాక్. ఈ స్థాయి రెమ్యూనరేషన్ తో దక్షిణాది అనుష్క, నయనతారలు టాప్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు మరింత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. నయనతార ఒక యాడ్ ఫిల్మ్ కోసం అత్యంత భారీ స్థాయి పారితోషకాన్ని తీసుకుంటోంది అనేది. టాటా స్కై డీటీహెచ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితం అయ్యింది నయనతార. అందుకోసం ఆమె ఏకంగా ఐదు కోట్ల రూపాయల మొత్తాన్ని పొందుతోందని సమాచారం. టాటా స్కై యాడ్ లో నటించడంతో పాటు నయనతార ఫొటోతో కూడుకున్న హోర్డింగులు పెట్టుకోవడం, పాంప్లేట్లు అచ్చు వేసుకోవడానికి గానూ ఈ పారితోషకం దక్కుతోందని తెలుస్తోంది.

మరి దీని కోసం పెద్దగా కష్టపడేది ఏమీ ఉండదు. నిమిషాల వ్యవధిలో ఉండే యాడ్ ఫిల్మ్ కు, కొన్ని పోజులకే నయనతారకు ఐదు కోట్ల వరకూ దక్కుతుండటం ఆమె క్రేజ్ కు నిదర్శనంగా మారింది. దక్షిణాదిన యాడ్ ఫిల్మ్, ప్రమోషనల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఇంత మొత్తం తీసుకుంటున్న హీరోయిన్లు ఎవరూ లేకపోవడం గమనార్హం.