సహజత్వం కోసం మందుకొట్టిన భామ!

0

విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘టాక్సీవాలా’ నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాయిదాల ప్రభావంతో కాస్త బజ్ తక్కువగానే ఉంది. అయినప్పటికీ విజయ్ క్రేజు పీక్స్ లో ఉంది కాబట్టి సినిమా విడుదల సమయానికి పరిస్థితి మారుతుందని నిర్మాతలు హోప్ ఫుల్ గానే ఉన్నారట. ఈ సినిమాలో సిడ్ శ్రీరాం పాడిన ‘మాటే వినదుగా’ పాట ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచింది.

ఇదిలా ఉంటే సినిమా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ రీసెంట్ గా తన పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ సంగతులు రివీల్ చేసింది. ఈ సినిమాలో ఒక లాంగ్ సీన్ ఉందట. ఆ సీన్లో మందుకొట్టినట్టు నటించాల్సి ఉందని దర్శకుడు చెప్పడంతో సహజత్వం కోసం మందుకొట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ సీన్ షూటింగ్ జరిగినన్ని రోజులూ తన క్యారవాన్ లో వోడ్కాను మినిట్ మెయిడ్ తో కలిపి తాగానని.. ఆ మత్తులోనే షూటింగ్ లో పాల్గొన్నానని తెలిపింది.

మందుకొట్టడం తనకు మొదటిసారి అని.. మత్తులో ఉన్నప్పుడు విపరీతంగా నవ్వొచ్చేదని.. ఆ మత్తును హ్యాండిల్ చేయడం కష్టమేనని అంటోంది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత గానీ మనకు జవాల్కర్ ఆ మత్తు సీన్ ఎలా చేసిందో తెలీదు. షూటింగ్ వరకూ సహజత్వం కోసం రెండు పెగ్గులేస్తే ఇబ్బంది లేదు.. కానీ అది అలవాటై.. ‘మాటే వినదుగ.. వినదుగ వినదుగ’ అనిపిస్తేనే కష్టం!
Please Read Disclaimer