టాక్సీవాలా తర్వాత నిఖిల్ సినిమా?

0మహానటి’ తర్వాత నిజానికి రిలీజ్ కావలసిన విజయ్ దేవరకొండ సినిమా ‘టాక్సీవాలా’. కానీ అల్లువారి మాస్టర్ స్ట్రోక్ తో అది వెనక్కు పోయి ‘గీత గోవిందం’ ముందుకొచ్చింది. ఇప్పుడు ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ కావడంతో ‘టాక్సీవాలా’ కంటే ముందు విజయ్ మరో సినిమా ‘నోటా’ ను ముందుకు తీసుకొచ్చారు. ఏదేమైనా ‘టాక్సీవాలా’ మరో రెండు నెలల్లో రిలీజ్ అవుతుందని అంటున్నారు.

‘టాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సాంకృతాయన్ అనే విషయం తెలిసిందే. ‘టాక్సీవాలా’ ఇతనికి రెండో సినిమా. మొదటి సినిమా ‘ది ఎండ్’ ఫ్లాప్ గా నిలిచింది గానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ కు భారీ మార్కెట్ ఉంది కాబట్టి.. ‘టాక్సీవాలా’ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే అవకాశాలు ఫుల్ గానే ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ కాకమునుపే రాహుల్ నెక్స్ట్ ఫిలిం ఫైనలైజ్ అయిందట. యంగ్ హీరో నిఖిల్ కు ఒక థ్రిల్లర్ కథ వినిపిస్తే ఫుల్ గా ఇంప్రెస్ అయ్యాడట. నిఖిల్ నెక్స్ట్ చేయబోయే సినిమా ఇదేనట.

నిఖిల్ ప్రస్తుతం ‘ముద్ర’ అనే సినిమాలో నటిస్తున్నాడు. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ సూపర్ హిట్ ‘కనిదన్’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత రాహుల్ సాంకృతాయాన్ సినిమా మొదలుపెడతారట. త్వరలో ఇతర వివరాలు వెల్లడవుతాయని సమాచారం.