మోడీ నివాసం వద్ద టీడీపీ ధర్నా

0ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీలు దేశ రాజధాని దిల్లీ ఆందోళన ఉద్ధృతం చేశారు. ఈ రోజు ప్రధాని నివాసం ముట్టడికి యత్నించారు. ప్లకార్డులు చేతబూని ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

విభజన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని కోరారు. ఆందోళన చేస్తున్న ఎంపీలను పోలీసులు, భద్రతా బలగాలు అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించడంతో వారంతా రోడ్డుపై బైఠాయించారు. అయినప్పటికీ భద్రతా బలగాలు ఎంపీలను బలవంతంగా కాళ్లు, చేతులు పట్టుకుని బస్సులో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఈ సమయంలో పోలీసులకు, ఎంపీలకు స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.