టీడీపీ, కాంగ్రెస్ సంయుక్త ధర్నా

0ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ తెలుగుదేశం ఎంపీలు తమ ఆందోళన మరింత ఉద్ధృతం చేశారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వరుసగా రెండోరోజు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలకు కాంగ్రెస్‌ ఎంపీలు జత కలిశారు. ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య అని, విభజన హామీలను నిర్లక్ష్యం చేస్తే కేంద్రానికి బుద్ధి చెబుతారని, రాజకీయంగా ఎలాంటి విభేదాలున్నా సమస్యల పరిష్కారంలో మాత్రం కలిసి పోరాడుతామని, ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు అన్నారు.