టీడీపీ నుంచి ప‌వ‌న్ కి ఆహ్వానం

0pawan-kalyan-in-tdpఅనుకొన్న‌దంతా జ‌రుగుతోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని ఆకర్షించ‌డానికి పార్టీల‌న్నీ చ‌క‌చ‌క ప్లాన్‌లు వేస్తున్నాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీ త‌ప్ప‌.. మిగిలిన పార్టీల‌న్నీ ప‌వ‌న్ పేరే జ‌పిస్తున్నాయి. మా పార్టీలోకి రావ‌య్యా,.. అంటూ ఆహ్వానాలు పంపుతున్నాయి. అంద‌రికంటే టీడీపీ ఈ విష‌యంలో ముందుంది. ప‌వ‌న్ తో ఆ పార్టీ నాయ‌కులు మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. పార్టీలోకి వ‌స్తే.. కీల‌క స్థానం అప్ప‌గిస్తామ‌ని, అధికారంలోకి వ‌చ్చిన స‌ముచిత స్థానం ఇస్తామ‌ని టీడీపీ భ‌రోసా ఇస్తోంది. ఒక‌వేళ స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా రంగంలోకి దిగాల‌నుకొంటే.. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ పోటీ అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌ద‌ని మాట ఇస్తోంది. అంతేకాదు.. ప‌వ‌న్ స‌పోర్ట్ చేసే అభ్య‌ర్థుల‌కు టీడీపీ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని, అందుకు ప్ర‌తిగా టీడీపీ త‌ర‌పున కొన్ని కీల‌క నియోజ‌క వ‌ర్గాల్లో ప్ర‌చారం చేయాల‌ని టీడీపీ నాయ‌కులు కోరుతున్నారు. ఈ ఆఫ‌ర్ కాస్త క్రేజీగానే ఉన్నా.. ప‌వ‌న్ మాత్రం ఇంకా ఈ విష‌యంలో స్పందించ‌డం లేదు. లోక్‌స‌త్తా, ఆప్‌ల‌తో పాటు కిర‌ణ్ కుమార్ రెడ్డి స్థాపించ‌బోయే కొత్త పార్టీ నుంచి కూడా ప‌వ‌న్ కి ఆహ్వానం అందింది. అయితే ప‌వ‌న్ త‌న అభిప్రాయాన్ని ఇంకా స్ప‌ష్టంగా చెప్ప‌డం లేదు. ప్రెస్‌మీట్ పెట్టాల్సిన రోజు ద‌గ్గ‌ర ప‌డుతోంది. మ‌రి నిర్ణ‌యం ఎప్పుడు తీసుకొంటాడో..?