ఈ అభ్యర్థి మీకు ఇష్టమేనా?

0voteదేశంలోనే తొలిసారిగా ఓటర్ల నుంచి ఐవీఆర్ ద్వారా అభిప్రాయ సేకరణ కు తెలుగు దేశం పార్టీ శ్రీకారం చుట్టింది. ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డింగ్ (ఐవీఆర్) పద్ధతి ద్వారా కోట్లాది మంది ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతున్నట్టు ఆ పార్టీ తెలిపింది. .

‘‘ఈ అభ్యర్థి మీకు ఇష్టమేనా?’’ అంటూ ప్రజలను ఫోన్ ద్వారా అడిగి, సరైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన 8.5 కోట్ల నెంబర్లు డేటాను ఆ పార్టీ సేకరించింది. మొదటి దశలో ఆరు లక్షల మంది టీడీపీ కార్యకర్తలను ఫోన్ ద్వారా సంప్రదించి.. వారి నియోజకవర్గాల్లో ప్రతిపాదనలో వున్న అభ్యర్ధుల్లో ఎవరు సరైన వారన్నదానిపై అభిప్రాయ సేకరిస్తారు.

ఈ వడపోత తర్వాత నియోజక వర్గలా వారీగా ప్రజలం నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారు. ఈ మేరకు.. ఐవీఆర్ సిస్టమ్ లో పాలు పంచుకుని అభ్యర్థుల ఎంపికలో భాగస్వాములు కావాలని టీడీపీ ప్రజలను కోరుతోంది.