జగన్, రోజాలపై ఎమ్మెల్యే అనిత ఫైర్

0TDP-MLA-anithaవైయస్సార్ర కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 16 నెలలు జైలులో ఉన్న దొంగగా ఆయనను అభివర్ణించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజాపైనా ఆమె విరుచుకుపడ్డారు.

జగన్ అనే ఒక దొంగ మిగతా వారిని దొంగ ఆనడం ఆలోచించాల్సిన విషయమని ఆమె అన్నారు. చంద్రబాబును కాల్చి చంపాలి, ఉరి తీయాలని మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఓటమి భయంతో ఇంటింటికి తిరిగి ఓటేయ్యండని అడుగుతున్నారని అన్నారు. 16 నెలలు జైలులో ఉన్న దొంగ ఓటేయ్యండని అడుగుతుంటే ప్రజలు నమ్మేస్థితిలో లేరని ఆమె అన్నారు.

“చంద్రబాబు మాకు ఎలా మాట్లాడాలో నేర్పించారు.. మీలాగా అసభ్యకరమైన వల్గర్ స్క్రిప్ట్ ను మాట్లాడటంలేదు.. రోజా మాటలు మహిళా సమాజం తల దించుకునేలా ఉన్నాయి.. మహిళలు వాడే దుస్తుల గురించి మాట్లాడుతున్నారు” అని ఆమె అన్నారు.

రోజాకు వృత్తిలో ఎందుకు సాంప్రదాయ దుస్తులు గుర్తుకురావడంలేదని అడిగారు. పీతల సుజాత దళితురాలు కాబట్టి మంత్రి పదవి నుంచి తీసేశారని, అందుకు చంద్రబాబు దళిత ద్రోహి అంటున్నారని అన్నారు. మరి జవహర్ ఏ కులానికి వస్తారు ఆయన మంత్రి కాదా అని అడిగారు.

“పీతల సుజాతను అసెంబ్లీలో అవమానపర్చినప్పుడు మీ నాయకుడు స్పందిచలేదు.. నువ్వు, జగన్ దళిత వ్యతిరేకి.. జగన్ మాటలతో మోసం చేస్తున్నారని అందరికీ తెలుసు.. నా దగ్గర డబ్బులేవన్న జగన్ 16 నెలలు జైలులో ఎందుకు ఉన్నారు” అని ఆమె అన్నారు.

“వాస్తవానికి దూరంగా ఉండే కల నీకు సీఎం అనే పదం.. జగన్ అబద్ధాలు చెప్పడు, మోసం చెయ్యడు అంటున్నావు నువ్వు నోరు విప్పితే అబద్ధాలు.. జనాలను చూసి ఆవేశంలో కాల్చిచంపుతానని మాట్లాడానని ఎన్నికల కమిషన్ కు రాసిన లేఖలో ఉంది” అని అన్నారు.

“నీలాంటి సైకిక్ పెషంట్, ప్రజల డబ్బులు దోచుకున్న దొంగకి ఓటు అడిగే అర్హత లేదు.. రోజా ఎంత ఎక్కువగా వైసీపీకి ప్రచారం చేస్తే టీడీపీకి అంత ప్లస్.. రోజా ఒక ఐరన్ లెగ్ అన్న సంగతి అందరికీ తెలుసు.. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి గెలుపు ఖాయం” అని ఆమెఅన్నారు.