శాతకర్ణి సినిమాలో టీడీపీ ఎమ్మెల్సీ

0TDP-MLC-Samanthakamaniరాజకీయాలకు – సినిమాలకు మధ్య అవినాభావ సంబంధం ఈనాటిది కాదు. సినిమాల నుంచి వచ్చి రాజకీయాల్లో దుమ్ము రేపిన నేతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండు ఉంది. అదే సమయంలో రాజకీయాల్లో ఉంటూ సినిమా సరదా తీర్చుకునేవారూ ఉన్నారు. అలాగే రెండు పడవలపైనా ప్రయాణం సాగించేవారూ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని ప్రస్తుత కాలానికి వస్తే టీడీపీలోనే ఎక్కువగా సినిమాకు సంబంధించిన వ్యక్తులున్నారు. నిర్మాతలు నటులు ఎక్కువగా ఉన్నది టీడీపీలోనే. అయితే… పూర్తిగా రాజకీయ నాయకురాలిగానే పేరున్న ఓ ప్రజాప్రతినిధి ఇప్పుడు బాలకృష్ణ వందో చిత్రం… భారీ అంచనాలున్న గౌతమీ పుత్ర శాతకర్ణిలో కనిపించబోతున్నారు.

నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో టీడీపీ ఎమ్మెల్సీ నటించారు. ఆమె పాత్రకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తయింది. గౌతమీపుత్ర చిత్రంలోని ఒక మార్కెట్ లో వ్యాపారి పాత్రలో శమంతకమణి నటించారు. సినిమాలో భార్యభర్తలైన బాలకృష్ణ – శమంతకమణి ఇద్దరూ మారువేషంలో మార్కెట్ కు వస్తారు. ఆ సమయంలో వారిద్దరు ఒక దుకాణం వద్దకు వెళ్తారు. అక్కడే బాలకృష్ణకు సంబంధించిన నాణేం జోబులోంచి కిందపడిపోతోంది. దానిపై శ్రియ కాలు పెట్టబోగా శమంతకమణి చేయి అడ్డుపెట్టి అడ్డుకుంటారు. ”కాలు తీయ్… మా దేవుడినే తొక్కుతావా” అని శమంతకమణి అంటారు. దాదాపు రెండు నిమిషాల పాటు శమంతకమణి ఈ సినిమాలో కనిపిస్తారని చెబుతున్నారు.

కాగా అనంతపురం జిల్లాకు చెందిన శమంతకమణి గతంలో శింగనమల ఎమ్మెల్యేగా పలుమార్లు పనిచేశారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆమె కుమార్తె యామిని బాల ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శమంతకమణి కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు.