ఎంపీలకు విప్ జారీ చేసిన టీడీపీ

0పార్లమెంట్‌ సమావేశాలు ముగిసే వరకు ఎంపీలు తప్పనిసరిగా సభకు హాజరుకావాలని తెలుగుదేశం పార్టీ విప్‌ జారీ చేసింది. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకపోవడం, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా ఎన్డీఏ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ శుక్రవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ తమ ఎంపీలకు విప్ జారీ చేసి, రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే కాంగ్రెస్‌, వామపక్షాలు, ఎస్పీ, బీఎస్సీతో వివిధ పార్టీలు అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.