బాలికకు బీర్ తాగించారు.. గంజాయి సిగరెట్ కాల్చమన్న తల్లిదండ్రులు (వీడియో)

0బాలబాలికలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో బాలికను మంచిదారిలో పెట్టాల్సిన తల్లిదండ్రులు దారుణంగా ప్రవర్తించారు. తన కడుపున పుట్టిన బిడ్డకు బీర్ తాగించారు. అంతటితో ఆగకుండా సిగరెట్ కాల్చేలా చేశారు. బాలిక వద్దంటున్నా.. బలవంతంగా తల్లిదండ్రులు సదరు బాధితురాలికి బీర్‌ను ఏకంగా బాటిల్‌ ద్వారా తాగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వివరాల్లోకి వెళితే.. అర్జెంటీనాలో ఓ చిన్నారిని ఇంట్లో పెట్టి బలవంతంగా బీర్ తాగించడం, గంజాయి సిగరెట్ పీల్చేలా చేశారు… ఆమె తల్లిదండ్రులు. దీంతో మత్తులో ఆ బాలిక కుప్పకూలిపోయింది. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో బాధితురాలి తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియోను ఫన్ కోసం తీశామని.. బాలిక పట్ల దారుణంగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.