‘తేజ్ ఐ లవ్ యూ`ఫైనల్ కలెక్షన్లు..డిజాస్టర్!

0ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు బ్యాడ్ టైం నడుస్తోంది. వరుస డిజాస్టర్లతో సతమతమవుతోన్న తేజూకు….`తేజ్ ఐ లవ్ యూ `రూపంలో మరో భారీ డిజాస్టర్ ఎదురైంది. విలక్షణ దర్శకుడు కరుణాకరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తేజూకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. తిక్క – విన్నర్ – జవాన్ – ఇంటిలిజెంట్ – తేజ్ ఐ లవ్ యూ….ఇలా వరుసగా 5 డిజాస్టర్లతో తేజూ డీలా పడ్డాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన `తేజ్ ఐ లవ్ యూ` చిత్రం….ప్రపంచ వ్యాప్తంగా కేవలం 4.22 కోట్లు వసూలు చేయడంతో నిర్మాత – డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ థియాట్రికల్ రైట్స్ 16 కోట్లు కాగా…కేవలం 4.22 కోట్లు వసూలయ్యాయి. 25 శాతం మాత్రమే వెనక్కు రావడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది.

ఏరియాల వారీగా ఈ సినిమా వసూళ్లు….

నైజాం 0.80 Cr
సీడెడ్ 0.70 Cr
ఉత్తరాంధ్ర 0.60 Cr
గుంటూరు 0.42 Cr
ఈస్ట్ 0.34 Cr
వెస్ట్ 0.33 Cr
కృష్ణా 0.37 Cr
నెల్లూరు 0.16 Cr
ఏపీ -టీఎస్ 3.72 Cr
ఆర్ వోఐ 0.30 Cr
ఓవర్సీస్ 0.20 Cr
వరల్డ్ వైడ్ 4.22 Cr