ట్రెండ్ సెట్ చేస్తా !

0Trend-setధనాధన్ ఫటాఫట్ అని సినిమాలు చేసి సూపర్ హిట్స్ కొట్టిన తేజా “ వెయ్యి అభద్దాలకి మోక్షం కలిగింది, ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ వచ్చి త్వరలో మన ముందుకి రాబోతుంది. పెద్దలు వంద అబద్దాలు ఆడి ఒక పెళ్లి చెయ్యమన్నారు కానీ మనోడు వెయ్యి అబద్దాలాడి ఒక జంటని కలుపు తున్నాడు. తేజా , రమణ గోగుల ల ఫస్ట్ టైం కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీలో విశేషమేమిటంటే “ తెలుగు ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు చెయ్యని విధంగా ఒక సింగిల్ టేక్ లో సాంగ్ షూట్ చెయ్యడం”. చిత్రం, నువ్వునేను వంటి చిన్న సినిమాలతో ట్రెండ్ క్రియేట్ చేసి, చాలాకాలంగా హిట్ కోసం తంటాలు పడుతున్నతేజ సాయిరాంశంకర్ ,ఎస్తేర్ లు హీరో హీరోయిన్స్ గా వస్తున్న ఈ మూవీతో మరొక్కసారి ట్రెండ్ సెట్ చేస్తానని అంటున్నాడు.