తేజ బాలయ్య ఇద్దరూ రైటే

0

మొన్న విడుదలైన సీత గట్టెక్కడం కష్టమే అని దాదాపు తేలినట్టే. వీకెండ్ వల్ల ఎంతో కొంత రాబడుతున్నా రేపటి నుంచి ఇబ్బందులు తప్పవని ట్రేడ్ రిపోర్ట్. నిజానికి టీమ్ మొత్తం దీని మీద చాలా ఆశలు పెట్టుకుంది. నేనే రాజు నేనే మంత్రికి రెండింతలు సక్సెస్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. అయితే నేలవిడిచి సాము చేసిన తేజ దర్శకత్వం తన క్యాలిబర్ కు మించి రిస్క్ తీసుకున్న సాయి శ్రీనివాస్ సాహసం వెరసి మొత్తంగా సీతను పల్టీ కొట్టించాయి.

ఇప్పుడు ఈ సందర్భంగా బాలయ్య తీసిన ఎన్టీఆర్ బయోపిక్ ప్రస్తావన మళ్ళి వస్తోంది. ఎందుకంటే సీత కన్నా ముందు ప్రారంభోత్సవం దాకా వచ్చి ఆగిపోయిన ఎన్టీఆర్ కు మొదట దర్శకుడు తేజ కాబట్టి. న్యాయం చేయలేనని తేజ బయటికి వస్తే ఆ పగ్గాలు క్రిష్ కు వెళ్లిపోయాయి. అంత చేసినా’ రెండు భాగాలూ డిజాస్టర్ కాకుండా ఎవరూ కాపాడలేకపోయారు

ఇప్పుడు తేజ దగ్గర ఈ ప్రస్తావన తెచ్చినప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ వదిలేయడం మంచిదయ్యిందని తనతో చాలా మంది అన్నారని ఆ సినిమా చూడకపోయినా తనకు ఆ రకంగా పేరు రావడం గురించి చెప్పాడు. తేజ కోణంలో ఒకందుకు అది మంచిదే అయ్యింది. ఎవరు టేకప్ చేసినా ఆ స్క్రిప్ట్ ని క్రిష్ కన్నా మిన్నగా తీయడం కష్టం . జనం ఆ రేంజ్ భజన రిసీవ్ చేసుకోవడానికి రెడీ గా లేరు.

ఇప్పుడు సీత వచ్చింది. ఇదీ అదే ఫలితాన్ని అందుకుంది. తేజ ప్రతిభ మీద మరోసారి అనుమానాలు వచ్చేలా చేసింది. సో బాలయ్య అప్పుడు తేజను పంపడం ఇటు తేజ ఎన్టీఆర్ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని వదులుకుని సీత టేకప్ చేయడం రైటే అయినప్పటికీ ఇద్దరి విషయంలో ఫలితం రాంగ్ గానే వచ్చింది. అదేనేమో విధి లీల అంటే
Please Read Disclaimer