తేజస్వి.. ఈ ఏడుపేమిటో?

0

బిగ్ బాస్’ రెండో సీజన్లో పాల్గొన్న పార్టిసిపెంట్లలో అత్యధిక వ్యతిరేకత ఎదుర్కొన్న వాళ్లలో తేజస్వి ఒకరు. హౌస్ లో ఉన్నపుడు ఆమె ప్రవర్తన.. వ్యాఖ్యలు చాలామందికి రుచించలేదు. ఒక దశలో ఆమె ప్రవర్తన శ్రుతి మించడంతో ఎలిమేనేషన్లో భారీగా నెగెటివ్ ఓటింగ్ చేసి ఆమెను సాగనంపేశారు. ఐతే రీఎంట్రీ కోసం గట్టిగా ప్రయత్నించి విఫలమైన తేజస్వి.. ఆ అవకాశం దక్కకపోవడంతో ‘బిగ్ బాస్’ మీద నెగెటివ్ రిమార్క్స్ చేసింది. అలాగే క్రౌడ్ ఫేవరెట్ ను కౌశల్ ను కూడా టార్గెట్ చేసింది. ఐతే జనాలు అదేమీ పెద్దగా పట్టించుకోలేదు. నెమ్మదిగా తేజస్వి లైమ్ లైట్ కు దూరమైంది. ఐతే తాజాగా ఆదివారం ‘బిగ్ బాస్-2’ గ్రాండ్ ఫినాలె రోజు మళ్లీ ఆమె వార్తల్లోకి వచ్చింది. చివరి రోజు మిగతా పార్టిసిపెంట్లతో పాటు ఆమె కూడా షోకు హాజరైంది. డ్యాన్స్ కూడా చేసింది.

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఫైనల్ గురించి స్పందించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ‘బిగ్ బాస్ ఫైనల్ టుడే.. హు కేర్స్’ అంటూ ఆమె ఒక ఫొటో షేర్ చేసి సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో తిట్లు తిట్టించుకుంది. తాను పాల్గొన్న షో ఫైనల్ జరుగుతుంటే.. ఆ కామెంట్ ఏంటి అంటూ జనాలు ఆమెను విమర్శించారు. ఫైనల్ పట్టనపుడు ఈ మెసేజ్ ఎందుకు పెట్టినట్లు అని ప్రశ్నించారు. పైగా ఫైనల్ కు తేజస్వి కూడా హాజరైంది. కౌశల్ విజేత కాబోతున్నాడని సంకేతాలు అందిన నేపథ్యంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు జనాలకు అర్థమైంది. ఇక షోలో కౌశల్ ను విజేతగా ప్రకటించాక.. మిగతా పార్టిసిపెంట్లందరితో కలిసి తేజస్వి ఫొటో దిగింది. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఎవరు బిగ్ బాస్ విజేతో ఇప్పుడు చెప్పండి అంటూ మరో కామెంట్ చేసింది తేజస్వి. అంటే తామందరం ఒక్కటిగా ఉన్నామని.. కౌశల్ ఒంటరి వాడని.. కాబట్టి నిజమైన విజేతలం తామే అని తేజస్వి సంకేతాలిస్తోందన్నమాట. ఇదంతా చూస్తే కౌశల్ విజేత కావడాన్ని తట్టుకోలేక తేజస్వి ఏడుస్తున్నట్లు లేదూ?
Please Read Disclaimer