ఈ పిల్లకు ఏమైనా వర్కవుటైందా?

0Tejaswi-Madivadaతన వంతు ప్రయత్నంగా ఒక హాటు ఫోటో షూట్ తో దండయాత్ర చేసింది తెలుగమ్మాయి తేజస్వి మదివాడ. అసలు కెరియర్ ప్రారంభించిన తొలినాళ్ళలో గ్లామర్ అనే పదం తన డిక్షనరీలో లేదన్నట్లు సూచించిన ఈ ఫ్యాషన్ డిజైనర్.. తరువాత ఐస్ క్రీమ్ సినిమాలో పిచ్చెత్తించింది. కాని ఆ తరువాత నో మోర్ హాట్ లుక్స్ అనేసింది. ఇప్పుడు మనస్సు మార్చుకుంది.

ఈ మధ్యనే రిలీజైన నేను నా బాయ్ ఫ్రెండ్స్ సినిమాలో చాలా హాటుగా కనిపించింది తేజస్వి. ఆ సినిమాలో హీరోయిన్ హెబ్బా పటేల్ కంటే కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ పోషించిన తేజస్వి ఎక్కువ మార్కులు వేయించుకుందంటే చూస్కోండి. ఇప్పుడేమో ఇలా హాటు హాటుగా ఫోటోలతో అరిపిస్తోంది. అయితే అమ్మడి ఫోటోలన్నీ ఇంటర్నెట్లో తెగ దర్శనం ఇస్తున్నాయి కాని.. ఇంతకీ అమ్మడుకు ఏమైనా వర్కవుటైందా అనేదే అసలు ప్రశ్న. ఈ మధ్యనే తన బికినీ ఫోటోలతో రచ్చ చేసిన సీరత్ కపూర్ కు చక్కగా అల్లు శిరీష్ సినిమాలో ఛాన్సొచ్చేసింది. మరి ఈ పిల్ల సంగతేంటో చూడాలి.

అదిగో ఇప్పుడు మరో కొత్త సెట్ ఫోటోలతో ఊరిస్తోంది తేజస్వి. ఆమెకు ఎవరైనా ఛాన్సులు ఇస్తారో లేదో తెలియదు కాని.. ఆ ఫోటోలను చూసి మనస్సు పారేసుకోవడానికి ఆమె మాత్రం బాగానే ఛాన్సులు ఇస్తోంది.