మావయ్య కు సపోర్ట్ గా సాయి ధరమ్ తేజ్..

0సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్..మరోసారి తమ మావయ్య పవన్ కళ్యాణ్ ఫై ఉన్న ప్రేమను పబ్లిక్ గా మరోసారి చెప్పి అభిమానులను ఆనందపరిచాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తో బిజీ గా ఉన్న సంగతి తెల్సిందే.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యం లో సాయి ధరమ్ తేజ్ ను మావయ్య తరుపు ప్రచారం చేస్తారని అడుగగా..పవన్‌ కల్యాణ్‌ ఆదేశిస్తే జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమేనని తన ఉద్దేశాన్ని తెలియజేశారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హీరోయిన్‌ కేథరిన్‌తో కలిసి శుక్రవారం వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ ఆదేశిస్తే జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమేనని తన ఉద్దేశాన్ని తెలియజేశారు. తాను నటించిన ‘తేజ్‌.. ఐ లవ్‌ యు’ సినిమా ఈ నెల 29న విడుదలవుతుందని, మరో సినిమా షూటింగ్‌ దశలో ఉందని సాయిధరమ్‌ తెలిపాడు. ఇటీవలే రామ్ చరణ్ సైతం పవన్ కళ్యాణ్ చెపితే తప్పకుండా ప్రచారం చేస్తానని తెలిపిన సంగతి తెల్సిందే.