చిరంజీవి కొడుకు ‘ఎవడు’… వస్తే తాట తీస్తాం…

0

yevadu-telanganaకేంద్ర మంత్రి హోదాలో ఉన్న చిరంజీవి రాష్ట్ర విభజనను అడ్డుకోలేకపోయారని, పదవి కోసం సోనియా గాంధీకి తొత్తుగా పనిచేస్తున్నారని సీమాంధ్ర ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీకు కుమారుడు రామ్ చరణ్ చిత్రం ఎవడు వస్తే… అడ్డుకుంటామని వారు అంటున్నారు. దీంతో మెగా ఫ్యామిలీ మూవీస్ రామ్ చరణ్ ‘ఎవడు’, పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలు ఇప్పట్లో రిలీజయ్యే సూచనలు లేనట్లు తెలుస్తుంది.

పవన్ కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమా ఆగష్టు 7న రిలీజ్ కానుంది. అదేవిధంగా రామ్ చరణ్ ఎవడు సినిమాను ఆగష్టు 21 విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. తాజా పరిస్థితుల్లో ఈ రెండు సినిమాలు వాయిదాపడే అవకాశం ఉంది. నిజానికి రామ్ చరణ్ ‘ఎవడు’ ఆగస్టు 1న విడుదల చేయాల్సి ఉంది. కానీ చిరంజీవి వద్దని చెప్పటంతో వాయిదా వేసుకున్నారు.

చిరంజీవికి రాష్ట్ర విభజన జరుగుతుందని ముందే తెలుసుననీ, అందుకే ‘ఎవడు’ సినిమాను వాయిదా వేయమని చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర విభజన జరుగుతుందని తెలిసి కూడా చిరంజీవి అడ్డుకోలేకపోయారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ప్రభావం ‘ఎవడు’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలకే కాకుండా భవిష్యత్తులో వచ్చే మెగా ఫ్యామిలీ సినిమాలపై కూడా పడే అవకాశం ఉందని సినీవర్గాలు అంటున్నాయి.

చిరంజీవి కొడుకు ‘ఎవడు’… వస్తే తాట తీస్తాం…, telangana effect on yevadu, yevadu release postpone, evadu movie release date, evadu movie review,