రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా భారీ ఉద్యోగ ప్రకటన

0తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ భారీ ఉద్యోగ ప్రకటన చేయబోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 వేల కొలువులు ప్రకటించనున్నారు. ఇప్పటికే పోలీసు శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసిన 18,428 ఉద్యోగాలు ఉండగా.. మరో 32 వేల ఉద్యోగాలకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వబోతున్నారు.

ఇక ఏ ఏ శాఖలో ఎన్ని ఎన్ని కొలువులు ప్రకటించబోతున్నారో మీరే చూడండి.

* విద్యుత్తు శాఖలో 13 వేలు
* సింగరేణిలో 7000 పోస్టులు
* గ్రూప్‌-1 కింద 34 డిప్యూటీ కలెక్టర్లు
* జిల్లా రిజిస్ట్రార్లు, వాణిజ్య పన్నుల అధికారులు, ఎంపీడీవోలు కలిపి 200-300 పోస్టులు
* ఒక్క రెవెన్యూ శాఖలోనే 1237 పోస్టుల భర్తీ, వీటిలో 217 జూనియర్‌ అసిస్టెంట్‌, 292 టైపిస్ట్‌, 13 సీనియర్‌ స్టెనో, 15 జూనియర్‌ స్టెనో, 700 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులకు ప్రకటన వెలువడనుంది.

ఇవి కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. గురుకులాల్లో పోస్టుల భర్తీకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్డు వీటి భర్తీ ప్రక్రియను చేపట్టనుంది.

* సివిల్ ఎస్సైలు 710, సివిల్ కానిస్టేబుళ్లు 5,909

మొత్తం 18,428 పోస్టుల్లో 739 ఎస్సై (710 సివిల్, 29 కమ్యూనికేషన్) పోస్టులు
* సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 5,909
* 5,273 ఏఆర్ కానిస్టేబుళ్లను భర్తీ చేయనున్నారు
* 4,816 టీఎస్‌ఎస్పీ (పురుషులు)
* 485 టీఎస్పీఎఫ్ కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఎస్సై ఉద్యోగానికి 21 నుంచి 25 ఏండ్లు, కానిస్టేబుల్ అభ్యర్థులకు 18 నుంచి 22 ఏండ్లు వయోపరిమితిని నిర్ణయించారు. ఎస్సై పోస్టుకు డిగ్రీ పూర్తిచేసినవారు, కానిస్టేబుల్ పోస్టుకు ఇంటర్ పూర్తి చేసినవారు అర్హులు. వయస్సు, విద్యార్హత విషయాల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారు రూ.800 (ఎస్సీ, ఎస్టీలకు రూ.400), ఎస్సై పోస్టుకు రూ.వెయ్యి (ఎస్సీ, ఎస్టీలకు రూ.500) టీఎస్ ఆన్‌లైన్ లేదా ఏపీ ఆన్‌లైన్ లేదా మీసేవ కేంద్రాల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.