గుండు హనుమంతరావుకు ఆర్ధిక సాయం ప్రకటించిన ప్రభుత్వం

0gundu-hanumantha-raoకిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ హాస్యనటుడు గుండు హన్మంతరావుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. చికిత్స నిమిత్తం 5 లక్షల రూపాయల నగదును ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్… గుండు హన్మంతరావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయాల్సి ఉందని వైద్యులు సూచించారు. అయితే చికిత్సకు అవసరమైన ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇటీవలే హన్మంతరావు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి సినీ పెద్దలకు విన్నవించింది. స్పందించిన మెగాస్టార్ చిరంజీవి రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసి ఆదుకున్నారు.