ఢిల్లీలో ఏపీ కోసం తెలంగాణ యువకుడి ఫైట్

0ప్రత్యేక హోదా కోసం ఏపీలో ప్రాణాలు పోతున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్నీ మధ్యే ఎంపీలు అవిశ్వాసం పెట్టారు. పార్లమెంట్ ఎదుట ఎన్నో రోజులు నిరసన తెలిపారు. ఎంతకూ కేంద్రం స్పందించడం లేదు. హోదా ఇస్తామని కనీసం మాట మాత్రమైనా చెప్పడం లేదు. దీంతో ఢిల్లీలో ఉన్న తెలుగు యువకులు రగిలిపోతున్నారు. కేంద్రం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఫ్లకార్డు పట్టుకొని ఢిల్లీ మెట్రో భవన్ దగ్గరున్న ఓ తెలుగు యువకుడు టవర్ ను ఎక్కేశాడు. అక్కడే మీద కూర్చొని నిరసన తెలిపాడు. టవర్ ఎక్కాడనే వార్త తెలియగానే మీడియా మొత్తం వాలిపోయింది. అతడిని అతి కష్టం మీద పోలీసులు కిందకు దించారు. ప్రత్యేక హోదా ఇవ్వని మోడీ ప్రభుత్వంపై యువకుడు విమర్శలు చేశాడు. కాగా హోదా కోసం టవరెక్కి నిరసన తెలిపింది తెలంగాణ యువకుడు కావడం విశేషం. వరంగల్ కు చెందిన ఉమేష్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.