ఆ ఫోన్ల‌లో టెలిగ్రాం యాప్ ఇక ప‌నిచేయ‌దు!

0telegram-appటెలిగ్రాం యాప్‌… ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఇది. వాట్స‌ప్‌కు దీటైన ఫీచ‌ర్ల‌తో ముందుకు దూసుకెళ్తోంది. అయితే ఈ యాప్ ఇక‌పై కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ప‌నిచేయ‌దు. ఆండ్రాయిడ్ 2.2, 2.3, 3.0 వెర్ష‌న్ ఉన్న ఫోన్ల‌లో టెలిగ్రాం యాప్ ప‌నిచేయ‌ద‌ని ఆ సంస్థ ప్ర‌తినిధులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఈ యాప్‌ను వాడుకోవాలంటే యూజ‌ర్లు క‌నీసం ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్ష‌న్ ఉన్న ఫోన్ల‌ను వాడాలి. యూజ‌ర్ల‌కు మ‌రింత స‌మ‌ర్థ‌వంత‌మైన ఫీచ‌ర్ల‌ను అందించాల‌నే ఉద్దేశంతోనే పాత ఆండ్రాయిడ్ వెర్ష‌న్ ఉన్న ఫోన్ల‌కు త‌మ స‌పోర్ట్‌ను నిలిపివేసిన‌ట్టు టెలిగ్రాం చెబుతోంది.