టెలినార్ షాకింగ్ 4G ఆఫర్

0Telinor-unlimited-data-offerరిల‌య‌న్స్ జియో వ‌రుస ఆఫ‌ర్ల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న మిగిలిన టెలికం కంపెనీలు రోజుకో ఆఫ‌ర్‌తో జియోకే షాక్ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. తాజాగా టెలినార్ ఏపీ, తెలంగాణ సర్కిల్‌లోని కొత్త 4G వినియోగదారులకు అపరిమిత డేటా ఆఫర్ ప్రకటించింది.

మొట్టమొదటిసారిగా 73 రూపాయలతో రీచార్జ్‌ చేసుకున్న వినియోగదారులకు 30 రోజుల పాటు అపరిమితి 4జిG / 2G ఇంటర్నెట్‌ సర్వీసులను అందించనున్నట్లు టెలినార్‌ తెలిపింది. ఈ ఆఫర్‌తో పాటు 90 రోజుల పాటు నిమిషానికి 25 పైస‌ల‌కే లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్ అందిస్తున్న‌ట్టు పేర్కొంది.

అలాగే లైఫ్‌టైమ్‌ వ్యాలిడిటీతో 25 రూపాయల ఉచిత టాక్‌టైమ్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు తెలిపింది. 30 రోజల తర్వాత అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను అందుకోవాలంటే 47 రూపాయల స్పెషల్‌ టారిఫ్‌ వోచర్‌ను రీచార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

ఈ ఎస్‌టివి కాలపరిమితి 28 రోజులు. 73 రూపాయలతో కొత్త కనెక్షన్‌ యాక్టివేషన్‌ చేసుకున్న కస్టమర్లు 120 రోజుల్లో 47 రూపాయలతో రీచార్జ్‌ చేసుకుంటేనే అపరిమిత సర్వీసులను అందుకోవచ్చని టెలినార్‌ తెలిపింది.