సాహోలో తెలుగు హీరోయిన్

0Prabhas-In-SAahoబాహుబలి బ్రహ్మాండమైన హిట్ కావడంతో ప్రభాస్ నెక్ట్స్ ఫిలిం ‘సాహో’పైనే ఇప్పుడందరి దృష్టి ఉంది. ఐదేళ్ల పాటు బాహుబలికే షెడ్యూల్స్ కోసం అన్నీ కేటాయించి ఎంతగానో శ్రమించిన ప్రభాస్ ప్రస్తుతం వెకేషన్ కోసం యూఎస్ వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగిరాగానే జూన్ మొదటి వారంలో సాహో షూటింగ్ ప్రారంభించాలన్నది డైరెక్టర్ సుజిత్ ఆలోచన.

ఈ సినిమాకు డైరెక్టర్ – స్టోరీ – స్క్రిప్ట్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి… ఒక్క హీరోయిన్ తప్ప. మరోవైపు షూటింగ్ స్టార్ట్ చేసే టైం దగ్గరపడుతోంది. దీంతో హీరోయిన్ ఎవరన్నదే ఇప్పుడు ఇంట్రస్టింగ్ పాయింట్ గా ఉంది. నిజానికి టాప్ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకుందామని ఆలోచన చేశారు. దీనివల్ల హిందీ ఆడియన్స్ కు ఈజీగా కనెక్ట్ కావచ్చన్నది ఐడియా. ఒక స్టేజ్ లో పరిణీతి చోప్రా.. ఆలియా భట్.. శ్రద్ధా కపూర్.. దిశా పఠాని వంటి వారి పేర్లు పరిశీలనకు వచ్చినా ఫైనల్ కాలేదు. చివరకు బాలీవుడ్ హీరోయిన్లందరిని పక్కన పెట్టేసి తెలుగు హీరోయిన్ నే తీసుకోవాలని డిసైడయ్యారని టాక్. ఇది ప్రధానంగా తెలుగు సినిమా కావడంతో ఇక్కడి హీరోయిన్ ని తీసుకోవడమే బాగుంటుందన్నది ప్రభాస్ ఆలోచన అని యూనిట్ వర్గాలు అంటున్నాయి.

బాహుబలికి సుదీర్ఘ సమయం పట్టడంతో సాహో మాత్రం ఫాస్ట్ గా షూటింగ్ చేయాలన్నది ప్రభాస్ ఆలోచన. ఆరు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి ఈ సంవత్సరం ఆఖరుకు ఫస్ట్ కాపీ రెడీ చేసేయాలని పట్టుదలతో ఉన్నాడు. చూద్దాం ఏ హీరోయిన్ ను ఫైనల్ చేసి ఎప్పుడు రంగంలోకి దించేస్తాడో!!