తెనాలి రామకృష్ణ ప్రీ లుక్: కాస్త తేడాగా..

0

యువ హీరో సందీప్ కిషన్ కు ఈమధ్య చెప్పుకోదగ్గ విజయాలు దక్కలేదు. అయినా అలుపెరగకుండా విజయం కోసం తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. సందీప్ ప్రస్తుతం ‘తెనాలి రామకృష్ణ BA.BL’ అనే ఒక కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ లాంటి జీ. నాగేశ్వరరెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ విడుదల చేశారు నిర్మాతలు.

ఈ రోజే ఎందుకంటే.. రేపు మే 7 న సందీప్ కిషన్ పుట్టిన రోజు. అందుకే రేపు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారట. దానికి ముందు శాంపిల్ గా ప్రీ లుక్ ను ఈరోజు విడుదల చేశారు. పెయింటింగ్ లాగా ఉన్న ఈ ప్రీ లుక్ లో సందీప్ కిషన్ కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక టేబుల్ పై డాబుగా ఒకదానిపై మరో కాలు పెట్టుకుని ఉన్నాడు. ఆయన బూట్లు మాత్రమే హైలైట్ అయ్యేలా ఉంది ఈ ప్రీ లుక్. టేబుల్ పై కొన్ని ఫైల్స్.. ఒక పెద్ద పుస్తకం.. ఆ బుక్కుపై టీ గ్లాసు ఉంది. పక్కనే కళ్ళజోడు కూడా ఉంది. ఓవరాల్ గా ఈ ప్రీ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. లాయర్ టైటిల్… ఈ గెటప్ చూస్తుంటే చిరంజీవి ‘చంటబ్బాయ్’ స్టైల్ కామెడీ ఉంటుందేమో మరి.

ప్రీ లుక్ తో ఆసక్తి రేకెత్తించిన ఈ ‘తెనాలి రామకృష్ణ BA.BL’ మరి రేపు ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన హన్సిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. సాయి శ్రీరాం ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్.
Please Read Disclaimer