ఈసారి రాజకీయ కత్తి

0మనకున్న టాలెంటెడ్ డైరెక్టర్స్ లో మురుగదాస్ ది చాలా ప్రత్యేక స్థానం. కమర్షియల్ ఎలెమెంట్స్ ని మిస్ చేయకుండా సోషల్ మెసేజ్ ని ఆలోచించేలా చూపడంలో అతను సిద్ధహస్తుడు. ఏదో కలిసిరాక తెలుగులో చేసిన రెండు సినిమాలు స్టాలిన్-స్పైడర్ ఆడలేదు కానీ దాస్ డబ్బింగ్ సినిమాలన్నీ తెలుగులో సైతం భీభత్సంగా ఆడినవే. టాగోర్-ఖైదీ నెంబర్ 150 లాంటి బ్లాక్ బస్టర్స్ దాస్ సినిమాల రీమేకులే. తాజాగా విజయ్ తో హ్యాట్రిక్ మూవీ చేస్తున్న మురగదాస్ ఈసారి బ్యాక్ డ్రాప్ గా పాలిటిక్స్ ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే ఆన్ సెట్స్ నుంచి లీక్ అయిన స్టిల్స్ లో సీఎంగా నటిస్తున్న రాధా రవి కటవుట్స్ తో ఫోటోలు బయటికి రావడంతో మురగదాస్ బాణం రాజకీయాల మీద అని అర్థమైపోయింది. తుపాకీలో తీవ్రవాదం కత్తిలో కార్పొరేట్ సంస్థల దోపిడీ రమణలో లంచగొండితనం ఇలా ఏదో ఒక సోషల్ ఇష్యూ తీసుకునే మురుగదాస్ ఈసారి ఏకంగా తమిళనాట సున్నితంగా ఉండే రాజకీయాల జోలికి వెళ్లడం సంచలనం రేపుతోంది.

విజయ్ లాంటి స్టార్ హీరోని అలాంటి సబ్జెక్టు లో చూపిస్తే హైప్ మామూలుగా ఉంటుందా. ఇప్పటికే బిజినెస్ పరంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ మూవీ రిలీజ్ కు ముందు కనీసం 150 కోట్ల దాకా వ్యాపారం చేస్తుందని అక్కడి ట్రేడ్ అంచనాలో ఉంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ విజయ్ కు 62వది. రాజకీయ నేపధ్యాన్ని తీసుకున్న మురుగదాస్ సాధారణ రాజకీయ పరిస్థితులను తీసుకున్నాడా లేక చాలా క్లిష్టంగా ఉండే తమిళ పాలిటిక్స్ ని టచ్ చేశాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో ఏది నిజమైనా సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది అంటున్నారు విజయ్ ఫాన్స్. తమ హీరోతో చేస్తున్న మూడో సినిమా కాబట్టి వాటిని మించే రేంజ్ లో ఇది ఉండాలని ఆశిస్తున్నారు. దీపావళి విడుదల టార్గెట్ చేసిన ఈ మూవీ తెలుగులో డబ్ చేయాలా లేదా రీమేక్ జరుగుతుందా అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది