ఇక్కడ చాలా త్యాగాలు చేయాలి: తమన్నా

0తారల జీవితాలు అనందాలతో వెలిగిపోతుంటాయని భావిస్తుంటారు చాలా మంది. అయితే ”తమ జీవితంలో చాలా త్యాగాలు వుంటాయని, మాది ఆడంబర జీవితమే కానీ ఆనందం లేదు అంటోంది’

స్టార్స్ పరిపూర్ణ సంతోషాన్ని అనుభవించడం లేదు. రేయనక పగలనక షూటింగ్‌లో పాల్గొంటున్నాం. ఒక్క నిమిషం కూడా విశ్రమించకుండా శ్రమిస్తున్నాం. షూటింగ్‌ స్పాట్‌లో షాట్‌ రెడీ అని పిలవగానే వెళ్లి నిలబడాలి. మనసులో ఎలాంటి కష్టనష్టాలున్నా, అవి బయట పడకుండా నటించాలి.ఇష్టమైన ఆహారాన్ని కూడా తినలేం. అందాన్ని కాపాడుకోవడానికి కసరత్తులు చేయాలి. నాజూగ్గా ఉంచుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణ అమ్మాయిలను చూసినప్పుడు నేను వారిలా స్వేచ్ఛగా జీవించలేకపోతున్నాననే బాధ కలుగుతుంది. ఇక్కడ చాలా త్యాగాలు అవసరం” అంటుంది తమన్నా.