మీటూ రాజేసి.. వెళ్లిపోతోంది..

0

భారత్ లో మీటూ ఉద్యమం ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే.. బాలీవుడ్ దక్షిణాదిలో కొందరు హీరోయిన్లు నటీమణులు మీటూ లో భాగంగా వివిధ హీరోలు దర్శకులపై చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా బాలీవుడ్ లో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గుట్టుమట్లను బయటపెట్టి సంచలనం రేపింది. బాలీవుడ్ ప్రముఖ హీరో నానా పటేకర్ పై తనుశ్రీ చేసిన ఆరోపణలు దుమారం రేపాయి.

తనుశ్రీ బాలీవుడ్ లో మొదలుపెట్టిన మీటూ ఉద్యమం స్ఫూర్తితో చాలా మంది హీరోయిన్లు నటీమణులు స్పందించారు. తాము ఫిలిం ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు. ఇలా మీటూ ఆరోపణలతోనే కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ తన పదవిని కోల్పోయారు. తమిళ స్టార్ సీనియర్ హీరో అర్జున్ పై కేసులు నమోదై స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అలోక్ నాథ్ లాంటి ప్రముఖుల పరువు కూడా మీటూతో పోయింది. ఇలా మీటూ ప్రకంపనలు చాలా మంది కెరీర్ ను దెబ్బతీసింది..

మీటూ ప్రకంపనలకు ఆజ్యం పోసిన తనుశ్రీ మాత్రం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె ఇండియా నుంచి అమెరికాకు వెళ్లిపోతున్నట్టు ప్రకటించింది. కొన్ని నెలల కిందటే ఇండియాకు వచ్చి మీటూ మంటలు రాజేసి అందరికీ అంటించిన తనుశ్రీ ఇప్పుడు న్యూజెర్సీ వెళ్లిపోయి అక్కడే ఉంటానంటూ ప్రకటన చేసింది. తన భవిష్యత్ అక్కడే అంటోంది. తనుశ్రీపై పెట్టిన కేసులు పిటీషన్ల సంగతి ఏమవుతుందో చూడాలి మరి.
Please Read Disclaimer