తనూశ్రీ దగ్గర ‘ఆ’ వీడియోలట..పటేకర్ ఔటే..

0

తనుశ్రీ దత్తా.. ఈ బాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ గురించి నిజాలు వెల్లడిస్తూ బాలీవుడ్ లో దుమారం రేపుతోంది. ఆమధ్య తెలుగులో బాలక్రిష్ణ సరసన ‘వీరభద్ర’ అనే సినిమా నటించిన తనుశ్రీ దత్తా.. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లింది.. పలు సినిమాల్లో నటించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ లో తనకు ఎదురైనా లైంగిక వేధింపులపై నోరు విప్పింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. దీంతో బాలీవుడ్ లో తనుశ్రీ హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సీరియస్ అయిన నానా పటేకర్ తాజాగా ఆమెకు లీగల్ నోటీసులు పంపారు. అయితే తనకు ఇంతవరకూ నోటీసులు అందలేదని.. వచ్చినా భయపడను అంటూ తనుశ్రీ ఓ వీడియో పోస్టు చేసింది. ఆ వీడియోలో తనుశ్రీ డ్యాన్స్ చేస్తుండగా నానా పటేకర్ రోమాంటిక్ గా చూస్తున్నట్టు ఉంది. ఈ వీడియో బయటకు రావడంతో నానా పటేకర్ తో పాటు ఆ ఫిల్మ్ మేకర్ వివేక్ అగ్ని హోత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనుశ్రీకి వివేక్ అగ్నిహోత్రి కూడా మరో లీగల్ నోటీసులు పంపారు.

తనపై నానా పటేకర్ – వివేక్ కక్ష గట్టి నోటీసులు పంపడంతో మరింత రచ్చ చేయడానికి తనుశ్రీ రెడీ అయ్యిందట.. మీడియాకు నానా పటేకర్ కు సంబంధించిన మరిన్ని వీడియోలు లీక్ చేసే పనిలో ఉందట.. ఈమేరకు ఆమె సన్నిహితులతో కలిసి నానా పటేకర్ చేత లైంగిక వేధింపులకు గురైన మహిళలను కలుస్తోందట.. ఆ వీడియోలను సాక్ష్యాలుగా మీడియా ముందుకు తీసుకురావడానికి రెడీ అయ్యిందట.. దీంతో నానా పటేకర్ వీడియోల్లో ఇంకా ఏముంటాయి.? తనుశ్రీ చెబుతున్నట్టు ఏదైనా సంచలనం ఉందా అని బాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Please Read Disclaimer