పూనమ్ పాండే ఖర్మ..!

0

పూనమ్ పాండే సోషల్ మీడియా జనాలకు బాగా పరిచయం ఉన్న పేరే. హిందీ ఆడియన్స్ తో పాటు తెలుగు వారికి కూడా ఈమె పరిచయమే. ఈమధ్య ‘లేడీ గబ్బర్ సింగ్’ అనే సినిమాతో కాస్త హంగామా చేసింది కూడా. తాజాగా పూనమ్ పాండే ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ది జర్నీ అఫ్ కర్మ’ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా ట్యాగ్ లైన్ ‘ది ఇంపర్ఫెక్ట్ లవ్ స్టొరీ’.

కర్మ అనే అమ్మాయి(ఖర్మ కాదు!) జీవితంలో ఎదురైన పరిస్థితుల బూతు పురాణం ఇది. వయసులో పెద్దవాడైన శక్తి కపూర్ డబ్బు ఆశచూపించి కర్మ ను లైన్ లో పెడతాడు. కర్మ కూడా పరిమితులు లేకుండా సెన్సార్ గురించి అసలు అలోచించకుండా ముసలి బాయ్ ఫ్రెండ్ కు సహకరించి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఈ బూతు ఎంటర్టైన్మెంట్ కు తోడు ఒక మర్డర్ కూడా ఉంది. ఎవరు చేశారు.. తర్వాత ఏం జరిగింది అన్నది స్టొరీ.

ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది బీ గ్రేడ్ బూతు పురాణం. జనాలు ‘XXX అన్ సెన్సార్డ్’ లాంటి నో హోల్డ్స్ బార్డ్ వెబ్ సీరీస్ లకు అలవాటుపడుతున్న ఈ కాలంలో వింటేజ్ బాలీవుడ్ ఆన్ స్క్రీన్ రేపిస్ట్ గా పేరు తెచ్చుకున్న శక్తి కపూర్ ఇప్పుడు పూనమ్ పాండేతో చేసే స్టీమీ సీన్స్ ను చూసేందుకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుందో..! ట్రైలర్ కాన్సెప్ట్ కు తగ్గట్టే మ్యూజిక్ కూడా బీ గ్రేడ్ లో ఉనే ఉంది. ఏమో మీకు ‘బాగా’ నచ్చొచ్చేమో.. ట్రైలర్ పై ఒక లుక్కేసి ఆ తర్వాత డిసైడ్ చెయ్యండి.

అన్నట్టు.. ఈ శక్తి కపూర్ ‘సాహో’ బ్యూటీ శ్రద్ధ కపూర్ కి ఫాదర్!
Please Read Disclaimer