ట్రైలర్ టాక్ : భూమ్మీద ప్రిడేటర్స్ వేట

0`ప్రిడేటర్స్` సిరీస్ కి ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సిరీస్కి విపరీతమైన ఫాలోయింగ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. స్టార్ మూవీస్ హెచ్ బీవో వంటి చానెల్స్ కి ఇక్కడ విశేష ఆదరణ పెరుగుతున్న వేళ .. ఇలాంటి ఇన్నోవేటివ్ క్రియేటివ్ ఫిక్షన్ సినిమాల్ని మాస్ బాగా ఆదరిస్తున్నారన్న రిపోర్ట్ ఉంది. ఇకపోతే ది గ్రేట్ ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గర్ నటించిన ప్రిడేటర్స్ ప్రపంచవ్యాప్తంగా రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు అనువాదానికి మన బుల్లితెరపైనా గొప్ప ఆదరణ దక్కింది.

ఈ సిరీస్లో కొత్త సినిమా `ది ప్రిడేటర్` సెప్టెంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. తాజాగా రిలీజైన ట్రైలర్ అభిమానుల్ని కట్టిపడేస్తోంది. జెనెటికల్లీ అప్ గ్రేడెడ్ ప్రిడేటర్స్ భూమ్మీద ఓ చిన్న గ్రామంపై దండయాత్ర చేస్తే వాటిని ఎదుర్కొనేందుకు ఆర్మీ ఏం చేసిందన్నదే సినిమా కథాంశం. ట్రైలర్ ఆద్యంతం ప్రిడేటర్స్ వర్సెస్ హ్యూమన్ వార్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రిడేటర్స్ బ్రూటల్ హంట్ ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోందనడంలో సందేహం లేదు. ప్రఖ్యాత ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ నిర్మించిన చిత్రమిది. ప్రిడేటర్స్ దర్శకుడు షేన్ బ్లాక్ తాజా చిత్రానికి దర్శకత్వం వహించారు.

సై-ఫై సినిమాలకు అంతకంతకు ఆదరణ పెరుగుతున్న వేళ `ది ప్రిడేటర్స్` ఇండియాలో ఏ స్థాయి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాల్సిందే. బ్లాక్ పాంథర్ – జురాసిక్ వరల్డ్ 2 వంటి చిత్రాలకు దక్కినంత ఆదరణ దక్కితే – కేవలం ఇండియా నుంచి `ది ప్రిడేటర్స్` దాదాపు 300-400 కోట్లు కొల్లగొట్టడం ఖాయమనడంలో సందేహం లేదు.