రేపటి నుండి సినిమా థియేటర్స్ బంద్..

0మర్చి 2 నుండి సౌత్ మొత్తం థియేటర్ల బంద్ కు పిలుపునిచ్చారు దక్షిణ చిత్ర పరిశ్రమ జేఏసీ. గత ఆరు నెల‌ల నుంచి డిజిట‌ల్ ధ‌ర‌లు భ‌యంక‌రంగా పెంచేశారని, లాభాల కంటే వారికే ఎక్కువ ముట్టజెపుతున్నామని , కాస్త ధరలు తగ్గించమని కోరిన వారు తగ్గించలేదని అందుకే వారు మెట్టు దిగేవరకు థియేటర్స్ ఓపెన్ కావని జాయింట్ యాక్షన్ క‌మిటీ తెలిపింది.

జేఏసీ ఆధ్వర్యంలో హైద‌రాబాద్, చెన్నై, బెంగుళూరులో డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల యాజ‌మా‌న్యాలతో ప‌లు అంశాల‌పై చర్చలు జ‌రిపితే.. అవి విఫ‌ల‌మ‌య్యాయన్నారు. అందుకే థియేటర్స్ బంద్ కు పిలుపునిచ్చినట్లు కమిటీ చెర్మన్ డి. సురేష్ బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల‌లో ఉన్న అన్ని థియేట‌ర్ల యాజ‌మాన్యాలు పూర్తిగా మ‌ద్దతు ఇచ్చినట్లు తెలిపారు. నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్లు, పంపిణీ దారులు అంతా ఒకే తాటిపైకి వ‌చ్చి పోరాటం చేయ‌డానికి సిద్ధమ‌య్యాం. థియేట‌ర్లలో సినిమాల ప్రదర్వన నిలిపివేత ఎన్ని రోజులు కొన‌సాగుతుందో చెప్పలేమన్నారు. ప్రేక్షకులు సైతం మా పోరాటానికి మద్దతు తెలుపాలని ఈ సందర్బంగా సురేష్ బాబు తెలిపారు.