పవన్ మనసులో ఏముంది ?

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించాక సినిమాలకు స్వస్తి చెబుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి తర్వాత పవన్ ఇంకే ప్రాజెక్టులు సైన్ చేయలేదు కాని అంతకు ముందు తీసుకున్న అడ్వాన్సులు మాత్రం అలాగే ఉన్నాయి. మే 23న ఫలితాలు వచ్చేస్తాయి. అందులో జనసేన సాధించబోయే సీట్లెన్ని ప్రభుత్వ ఏర్పాటులో వేయబోయే పాత్ర గురించి అభిమానులకు తప్ప ఎవరికి పెద్దగా అంచనాలు లేవు కాని అనిశ్చితికి మారుపేరైన రాజకీయాల్లో ఏదైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంకో ఇరవై రోజులు ఆగితే మొత్తం తేలిపోతుంది.

ఒకవేళ జనసేన ఆశించిన ప్రయోజనం నెరవేరకపోతే పవన్ ఏం చేస్తాడన్న ఆసక్తి అభిమానులతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ బలంగా ఉంది. సినిమాలే చేయాలనే నిర్ణయం తీసుకుంటే మొదటగా మైత్రి బ్యానర్ కు కమిట్ కావాలి. ఎంత ఆలస్యమైనా పవన్ తో సినిమా చేస్తాం కాని అడ్వాన్సు మాత్రం వెనక్కు తీసుకోమని ఇంతకు ముందే నిర్మాతలు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే

ఇందులో భాగంగా క్యాజువల్ టాక్ పేరుతో గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో పవన్ కు ఓ లైన్ వినిపించారని ఇన్ సైడ్ టాక్. రిజల్ట్స్ వచ్చే వరకు ఏది చెప్పలేనని అప్పటిదాకా వెయిట్ చేయమని పవన్ చెప్పినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఏది నిజమో ఏది అబద్దమో తెలియదు కాని పవన్ తిరిగి సినిమాలు చేసే అవకాశాలు కొట్టిపారేయలెం. ఎనిమిదేళ్ళ గ్యాప్ తీసుకున్న చిరంజీవి కం బ్యాక్ ఇస్తే సాదరంగా ఆహ్వానించిన ఫ్యాన్స్ కు పవన్ ఏడాదిన్నర గ్యాప్ పెద్ద విషయం కాదు. నిజంగా పవన్ కమిట్ అయితే మళ్ళి ఎన్నికలు వచ్చే ఐదేళ్ళ గ్యాప్ లో ఈజీగా నాలుగు సినిమాలు చేయొచ్చు. మరి పవన్ ఆలోచన ఎలా ఉందో మళ్ళి మేకప్ వేసుకుంటాడో లేదో రేపు తేలిపోతుంది
Please Read Disclaimer