6 ఏళ్ల కుర్రాడికి.. సింపుల్ గా ఏడాదికి 70 కోట్లు..

0నిండా ఆరేళ్లు కూడా లేవు. పేరు రియాన్. ఈ కుర్రాడు ఏడాదికి 70కోట్లు సంపాదిస్తూ ఔరా అనిపిస్తున్నారు. అందరూ ఆడుకునే బొమ్మలతో రివ్యూలు ఇస్తూ అపరకుభేరుడిగా ఎదుగుతున్నాడు. ఆట వస్తువుల గురించి ఎవ్వరూ ఇవ్వలేని విధంగా రివ్యూలు ఇస్తూ కోట్లు కొల్లగొడుతున్నాడు.

అమెరికా దేశానికి చెందిన ఈ కుర్రాడికి చిన్పప్పటి నుంచి ఆటబొమ్మలంటే ఇష్టం.. పిల్లాడి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు… TOYS REVIEW పేరిట యూట్యూబ్ చానెల్ పెట్టి రియాన్ బొమ్మలపై ఇస్తున్న రివ్యూలను ఆ చానెల్ లో పెడుతుంటారు. ముద్దుముద్దుగా ఈ పిల్లాడు ఇస్తున్న రివ్యూలు అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ పోస్టులు వైరల్ అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ బుడ్డోడు పాపులర్ అయ్యాడు. ఈ చానెల్ ఇప్పుడు అత్యధిక రెవెన్యూ వెబ్ సైట్లలో ఒకటిగా నిలిచి రికార్డులను సృష్టిస్తోంది.

2015లో మొదలైన ఈ యూట్యూబ్ చానెల్ కు కోటి మంది సబ్ స్క్రైబర్స్ చేరారు. గతేడాది ఈ చానెల్ మీద మనోడు రూ. 70కోట్లకు పైగా సంపాదించాడు. 2017లో యూట్యూబ్ ద్వారా అత్యధికంగా సంపాదించిన వారి జాబితాలో రేయాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం రాయల్టీ ద్వారా ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న యూట్యూబ్ చానెళ్లలో TOYS REVIEW 8వ స్థానంలో ఉండడం విశేషం. ఇలా 6 ఏళ్లకే 70 కోట్లు సంపాదిస్తున్న ఈ బుడతడు.. ఇంకా పెద్దవాడు అయితే మరిన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి మరి.