అజ్ఞాతవాసి ట్రైలర్ ఆలస్యానికి ఇదే కారణం

0agnyathavasi-trailer-late-rపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్ తాజా చిత్రం అజ్ఞాతవాసికి సంబంధించి ప్రతి విషయంలో అభిమానులకు నిరీక్షణ తప్పటం లేదు. ఫస్ట్ లుక్, టైటిల్ కోసం ఫ్యాన్స్ చాలా రోజుల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. తరువాత టీజర్, ఆడియోలను వెంట వెంటనే రిలీజ్ చేసినా.. ప్రస్తుతం ట్రైలర్ కోసం మరోసారి నిరీక్షణ తప్పటం లేదు.

రిలీజ్ కు మరో ఐదు రోజులు మాత్రమే ఉండటంతో ట్రైలర్ ను ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ట్రైలర్ ఇప్పటికే రెడీ అయినా.. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి కాని కారణంగా విడుదల చేయలేదన్న ప్రచారం జరుగుతోంది. సెన్సార్ అధికారి మారటంతో ఆలస్యమైందంటున్నారు. దర్శక నిర్మాతలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటం కూడా ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది.

ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ శుక్రవారం అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కానీ చిత్రయూనిట్ మాత్రం రిలీజ్ పై ఎలాంటి ప్రకటనా చేయలేదు. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి ఖుష‍్బూ కీలక పాత్రలో కనిపించనున్నారు. తొలిసారిగా కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు.